ఏపీలో జగనన్న విద్యా దీవెన పథకం డబ్బులు త్వరలోనే విడుదల కానున్నాయి. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు(M) నన్నూరులో ఈ నెల 29న సీఎం జగన్ పర్యటించనున్నారు.
ఇందులో భాగంగానే సీఎం బటన్ నొక్కి 11లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. వచ్చే విడత నాటికి విద్యార్థితో పాటు తల్లి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే.