రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తెలపకుండా పెండింగ్ లో ఉంచే అధికారం గవర్నర్ లకు లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
శాసనసభ చట్టాలను రూపొందించకుండా అడ్డుకునే అధికారం గవర్నర్‌కు లేదని తెలిపింది. పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్‌ను ఆదేశించింది.