14 సంవత్సరాల చంద్రబాబు పాలనకు, నాలుగున్నరేళ్ల జగనన్న పాలనకు తేడా గమనించాలి. ప్రతి అవ్వాతాత రూ.2,750 పింఛను తీసుకుంటున్నారు. వికలాంగులు రూ.3,500 అందుకుంటున్నారు. అయన మాట్లాడుతూ.. దానికి ప్రధాన కారణం గతంలో వైయస్సార్, నేడు జగనన్న అని మంత్రి పినిపె విశ్వరూప్ తెలిపారు. చంద్రబాబు సీఎంగా పని చేసినప్పుడు 70 రూపాయలున్న పింఛన్ కనీసం 10 రూపాయలైనా పెంచాడా? చంద్రబాబు 30 లక్షల మందికి వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తే, ఈరోజు రూ.2,750 చొప్పున 64 లక్షల మందికి ఇస్తున్న జగనన్న. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంటే గుర్తుకొచ్చేది వైయస్సార్. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తూట్లు పొడిచిన చంద్రబాబు. 30 శాతం స్లాబ్ విధించి 70 శాతం తల్లిదండ్రులు కట్టుకోవాలని విద్యార్థులను గాలికొదిలేశాడు. మళ్లీ జగనన్న రాగానే వైయస్సార్ హయాంలో మాదిరిగా పూర్తి ఫీజు ఇస్తున్నారు. జగనన్న అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లకే సచివాలయ వ్యవస్థ ద్వారా 1.40 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. దేశానికే దిక్సూచిగా నిలిచిన జగనన్న. వైయస్ రాజశేఖరరెడ్డి సంక్షేమంలో రెండడుగులు వేస్తే, జగనన్న నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు. రాజ్యసభకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను 14 సంవత్సరాల్లో ఒక్కరినీ పంపని బాబు. నలుగురు బీసీలను రాజ్యసభకు పంపిన వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. సామాజిక న్యాయానికి ఛాంపియన్ జగనన్న. ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులిచ్చిన జగనన్న. బాబు కేవలం ముగ్గురికే ఇచ్చి ఏడాదికోసారి మార్చేశారు. నలుగురు ఎస్సీ మంత్రుల్నీ కొనసాగిస్తున్న సీఎం వైయస్ జగన్. ఎస్టీలు లేని మంత్రివర్గం చంద్రబాబుది, ఎస్టీని ఉపముఖ్యమంత్రి చేసిన ఘనత వైయస్ జగన్‌ది. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు. మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎం ఇచ్చిన జగనన్న అని కొనియాడారు.