మహారాష్ట్రలోని ముంబైలో 26/11 ఉగ్రదాడి జరిగి ఆదివారంతో 15 ఏళ్లు అయ్యాయి. 2008 నవంబర్ 11న ఉగ్రవాదులు ముంబైలో వరుసదాడులకు పాల్పడ్డారు. పది మంది ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా ముంబైలోకి చొరబడ్డారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ రైల్వే స్టేషన్, తాజ్ హోటల్, నారిమన్ లైట్ హౌస్ సహా 12 చోట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 175 మంది ప్రాణాలు కోల్పోయారు.