నాసిక్‌లోని మన్మాడ్-యెవాలా జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. 2 వాహనాలు హైవే మీదుగా వెళ్తుండగా కారు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.అంకై రైల్వే ఫ్లై ఓవర్‌పై జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని రోహిత్ ధన్వతే, శ్రేయాస్ ధన్వతే, లలిత్ సోనావానే, గణేష్ సోనావానే, ప్రతీక్ నాయక్‌లుగా గుర్తించారు. వీరంతా నాసిక్ వాసులు అని పోలీసులు తెలిపారు.ఐదుగురు యువకులు మన్మాడ్ సమీపంలోని కుండల్గావ్లోని మహసోబా దేవస్థాన్‌లో మతపరమైన కార్యక్రమంలో పాల్గొని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.