విశాఖపట్నం, ఉత్తర విశాఖ: కళాశాలకు వెళ్లిన ఓఇంటర్ విద్యార్థిని అదృశ్యమైనట్లు కంచరపాలెం పోలీసులు సోమవరం తెలిపారు. కంచరపాలెం ఇందిరానగర్-4 కాలనీకి చెందిన ఓ బాలిక(17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
రోజులానే కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. రెండు రోజులుగా ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బాలిక తండ్రి కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.