తిరుమల శ్రీవారి సుప్రభాత సేవ టికెట్లను భక్తులు లక్కీ డిప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అయితే విజయవాడకు చెందిన ఓ వ్యక్తి నకిలీ ఐడీ కార్డుతో సేవ టికెట్లను బుక్ చేశాడు.
ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించి అతడిని పట్టుకున్నారు. తిరుమల టూటౌన్ పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడు పాస్పోర్ట్ సాయంతో టికెట్లు 70 సార్లు బుక్ చేసినట్లు గుర్తించారు.