పిల్లిని కాపాడడం కోసం ఓ మహిళ ప్రాణాలు పోగొట్టుకుంది. కోల్‌కతాలో అంజనా దాస్ అనే 36 ఏళ్ల మహిళ పెంచుకుంటున్న పిల్లి పిల్లలు కనిపించకుండా పోయాయి.
అయితే సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ కోసం టెర్రస్ పైకి వెళ్లిన ఆమెకు టెర్రస్ కింద బాల్కనీ లాంటి ప్రాంతంలో చిక్కుకున్న ఓ పిల్లి కనిపించింది. దానిని కాపాడేందుకు టెర్రస్‌పై నుంచి కిందకు దిగుతున్న క్రమంలో కాలు స్లిప్ అయ్యి ఎనిమిదో అంతస్థు నుంచి ఆమె కిందకు పడిపోయి మరణించింది.