జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మీర్ కి ఖతార్ లో వింత అనుభవం ఎదురైంది. ఆయన విమానం దోహాలో దిగింది. జర్మన్ ఎంబసీ అధికారులు, సైనికులు ఆయనకు స్వాగతం పలికేందుకు రెడ్ కార్పెట్ వేసి రెడీ అయ్యారు. కానీ ఖతార్ మంత్రులు రిసీవ్ చేసుకోవడానికి సమయానికి రాక పోవడంతో ఆయన అరగంటపాటు విమానంలోనే వేచిచూశారు. ఖతార్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుల్తాన్ అల్ మురైచాయ్ ఎయిర్పోర్టుకు చేరుకోవడంతో ఆయన కిందకు దిగారు.