ఒడిశాలోని కెంఝహార్ జిల్లా 20వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.బాలిజోడి వద్ద రోడ్డు పక్కన ఆగివున్న లారీని జీపు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. బాధితులంతా గంజాం జిల్లా నుంచి తారిణి దేవి ఆలయ దర్శనానికి వెళ్తున్నారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.