వైసీపీ దుర్మార్గాలు ఆగాలంటే రానున్న ఎన్నికలలో టీడీపీని గెలిపించాలని మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి ప్రజలను కోరారు. పట్టణంలోని 12వ వార్డులో గురువారం బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయడమంటే ఆ పార్టీ దుర్మార్గాలను ప్రోత్సహించడమేనన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు మౌలాలి, పట్టణ కార్యదర్శి, క్లస్టర్ ఇన్చార్జ్ కొప్పుల శ్రీను, దూదేకుల మస్తాన్, 17వ వార్డు ఇన్చార్జ్ గులాబ్, తాళ్లపల్లి సత్యనారాయణ, 12వ వార్డు కార్యకర్తలు పాల్గొన్నారు.