చదువుకునే వయసులోనే ప్రేమలో పడ్డాడు. తన ప్రేమను ధైర్యంగా పెద్దల ముందు ఉంచాడు. దీనితో యువకుడి ప్రేమకు పెద్దలు కూడా అంగీకరించారు. అయితే ప్రేమ పెళ్ళికి పెద్దలు కొంత కాలం వేచి ఉండాల్సిందిగా గడువు పెట్టారు.ఈ నేపథ్యంలో ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా లోని ఇబ్రహీంపట్నం లోని కొండపల్లి శ్రామిక నగర్ (కొత్తగేటు)లో వేముల హేమంత్ ప్రసాద్ (19)అనే యువకుడు నివసిస్తున్నారు. కాగా హేమంత్ ప్రసాద్ ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి హేమంత్ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హేమంత్ ప్రసాద్ తన ప్రేమ విషయాన్ని పెద్దల ముందు ఉంచాడు..
అలానే వివాహం చేయాలని పెద్దలను అడిగారు. కాగా హేమంత్ ప్రసాద్ ప్రేమను పెద్దలు అంగీకరించారు. అయితే వివాహానికి కొంతకాలం ఆగాలని పెద్దలు చెప్పారు. దీనితో తాను ప్రేమించిన యువతితో వివాహం చేసుకునేందుకు పెద్దలు గడువు విధించడంతో హేమంత్ ప్రసాద్ మనస్తాపానికి గురైయ్యాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చి వీటిపిఎస్ కెనాల్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా కెనాల్ లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.