కేరళలోని మొఘతలాలో గురువారం సాయంత్రం షాకింగ్ ఘటన జరిగింది. 75 ఏళ్ల కృష్ణ ప్రసాద్ 36 ఏళ్ల ఇజ్రాయేలీ మహిళతో ప్రేమలో ఉన్నాడు. వారిద్దరూ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
వృద్ధాప్య సమస్యల కారణంగా తన ఆరోగ్యం క్షీణించడంతో ప్రేయసిని స్వదేశానికి వెళ్లిపోమని కృష్ణప్రసాద్ చెప్పాడు. ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరు చనిపోవాలనుకున్నారు. ప్రియురాలిని అతడు గొంతు కోసి చంపాడు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేశాడు.