ఉపాధ్యాయులపై వేధింపులు ఆపాలని యూటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం హిందూపురం పట్టణంలోని సప్తగిరి కళాశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన అధ్యక్షులు జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉ పాధ్యాయులను వేధించడమే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. మెరుగైన పీఆర్సీ సాధన కోసం, సీపీఎస్ రద్దు కోసం గతంలో ఉపాధ్యాయులు ఉద్యమించారని ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధిస్తోందన్నారు.