మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపి వ్యూహం ఫలించింది. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించింది. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
సాజా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపి అభ్యర్థిగా ఈశ్వర్ సాహు అనే రోజూ వారీ కూలీని పోటీలోకి బీజపి దించింది. అయితే గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర చౌబేను సాహు ఓడించారు.