తిరుపతి జిల్లాలోని 162 మంది గర్భిణిలను ప్రసూతి ఆస్పత్రులకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 31 గ్రామాలలో 2,620 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరు, ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాల్లోని తీర ప్రాంతాల్లో పూరిళ్లు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పాత ఇళ్లలో ఉంటున్న వారిని 47 పునరావాస శిబిరాలకు తరలించారు. ప్రతి శిబిరానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు.