తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సహాయక శిబిరాల నుంచి బాధిత కుటుంబాలను ఇంటికి పంపే ముందు ఆర్థిక ఆసరా కోసం రూ.1,000 నుంచి రూ.2,500 ఇవ్వాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ జీఓ నెంబరు 73 ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఒక లీటర్ పామాయిల్, కేజీ చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలను ఉచితంగా పంపిణీ చేయాలని మరో జీఓ ఇచ్చింది. తుపాను వల్ల దెబ్బతిన్న, కూలిపోయిన ఇళ్లు, గుడిసెలకు ఇచ్చే పరిహారాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచి ఇవ్వాలని ఆదేశించింది. సీఎం జగన్ సమీక్షలో ఈ విషయంపై ఆదేశాలు ఇవ్వడంతో అందుకనుగుణంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.