ఏలూరు జిల్లా, బుట్టాయూగుడెం మండలం, రాజానగరంలో విషాదం నెలకొంది. రాత్రి పాకలలో చలి మంట వేసుకొని ఉండగా గాలి వానకు పాక ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో పాకలో ఉన్న వెట్టి గంగ రాజు, జోడీ రాముడు అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మిచౌంగ్ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం, కొంగవారిగూడెం వద్ద ఎర్రకాల్వ జలాశయానికి రికార్డ్ స్థాయిలో వరద నీరు పెరుగుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా.. ప్రస్తుతం 82.68 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది.