యూపీ బాగ్‌పత్ జిల్లాలో లోనిలోని ఖన్నానగర్‌లో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. వివాహ విందులో పనీర్ కూర, రసగుల్లా తిన్న 50 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులలో వరుడు కూడా ఉన్నాడు. దీంతో వారంతా ఆసుపత్రి పాలయ్యారు.
వారిని జిల్లా ఆసుపత్రికి తరలించగా, 20 మంది చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వారు అస్వస్థతకు లోనయ్యారని, వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు.