కృష్ణా నదిలో ఇసుక లోడింగ్ చేస్తుండగా హఠాత్తుగా వరద రావడంతో ఎడ్ల బండి, యజమాని కొట్టుకుపోయారు. ఉయ్యూరు మండలం చినఓగిరాల నుంచి తోట్లవల్లూరు వద్ద కృష్ణా నది వద్ద ఇసుక లోడింగ్ చేస్తుండగా వరద రావడంతో కొంత మంది బళ్లతోసహా బయటకు వచ్చేశారు. వరద ఉద్ధృతికి బాట తెగిపోవడంతో బందెల శ్రీరాములు బండి కొట్టుకుపోతుండగా యజమాని ఒక ఎద్దు తాడు కోసి దాని తోక పట్టుకొని ఒడ్డుకు చేరాడు. రెండో ఎద్దును కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.