కంబదూరు మండల కేంద్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంజూరు అయిన నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శనివారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి మండలంలోని కాలనీలలో సిసి రోడ్లను ఏర్పాటు చేసి మండల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.