తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19వ తేదిన కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసినట్లు తెలిపింది.
డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేది వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాల్లో డిసెంబర్ 22 నుంచి 4,23,500 టోకెన్లు ఇవ్వనున్నన్నారు.