మహారాష్ట్రలోని మీరా-భైందర్-వసాయి విరార్ పోలీసులు విరార్ ప్రాంతంలో సెక్స్ రాకెట్‌ను ఛేదించారు. ముగ్గురు బంగ్లాదేశ్ బాలికలను పోలీసులు రక్షించారు.
బంగ్లాదేశ్‌కు చెందిన అశోక్ హర్ను దాస్ (54) విరార్‌లోని అర్నాలాలో ముగ్గురు బంగ్లాదేశ్ యువతులతో కలిసి తన ఇంట్లో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాస్‌ని విచారించగా 200-250 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి విక్రయించినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు.