విజయవాడ కనకదుర్గమ్మను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వీరి వెంట మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు ఉన్నారు.
ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. శాలువ, మెమొంటోతో మంత్రిని ఆలయ మర్యాదలతో సత్కరించారు.