ఉత్తరప్రదేశ్లోని బల్లియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. శ్రవణ్రామ్(35), తనభార్య శశికల(30) ఇద్దరూ భార్యాభర్తలు.
వీరికి ఇద్దరు కొడుకులు సూర్యారావ్(7), మిట్టు(4). అయితే భార్యభర్తల గత కొంత కాలంగా ఉన్న విబేదాలు ఉండగా, ఆదివారం మళ్ళీ గొడవ పడ్డారు. దీంతో మనస్తాపంతో శ్రవణ్ భార్యను, ఇద్దరు పిల్లల్ని కిరాతకంగా పొడిచి చంపాడు. ఆపై సూసైడ్ నోట్ రాసి, ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.