గూళ్యపాల్యం రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కుక్కలు మృతదేహాన్ని పిక్కుతింటుండగా గమనించిన గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రైల్వేస్టేషన్ సమీపంలో సుమారు మూడు రోజుల క్రితం మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి వయస్సు సుమారు 45ఏళ్లు ఉండొచ్చని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.