పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్ పార్టీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను లోక్‌సభ నుంచి బహిష్కరించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
సభలో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్తల నుంచి ఆమె డబ్బులు తీసుకున్నారన్న (క్యాష్ ఫర్ క్వెరీ) ఆరోపణలను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ధృవీకరించింది. అనంతరం ఆమెపై లోక్‌సభలో బహిష్కరణ వేటు పడింది.