రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన లాండ్ టైటిల్ చట్టం సామాన్య ప్రజలకు గొడ్డలిపెట్టు అని ఈ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని శ్రీకాకులం జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు ఆధ్వర్యంలో న్యాయవాదులు శ్రీకాకుళం జిల్లా కోర్టునుంచి జిల్లాపరిషత్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్పందనలో డిఆర్ఓ గణపతరావుకి వినతిపత్రం ఇచ్చారు.