ఏపీలోని జూనియర్ న్యాయవాదులకు 2023-24 సంవత్సరానికి గాను 2వ విడత ‘వైఎస్ఆర్ లా నేస్తం’ ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది జూనియర్ న్యాయవాదులకు బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు.
సీఎం మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా YSR లా నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఈ నాలుగేళ్లలో మొత్తంగా రూ.49.51 కోట్లు వెచ్చించామని తెలిపారు. అడ్వకేట్ల సంక్షేమం కోసం రూ.100 కోట్ల నిధిని ఏర్పాటు చేశామన్నారు.