నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో ఓ వ్యక్తి తాంత్రిక పూజల పేరిట పది మంది వ్యక్తులకు పైగా హత్య చేశాడనే విషయం కలకలం సృష్టిస్తుంది. వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిన ఆ వ్యక్తి గుప్త నిధులు వెలికి తీస్తానంటూ డబ్బులు వసూలు చేసి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇది గమనించిన అమాయక జనం మోసపోయామని గ్రహించి డబ్బుల కోసం నిలదీయగా వారిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.