చెన్నై పులియంతోపు కనికాపురం ప్రాంతానికి చెందిన మన్సూర్ భార్య సోనియా ప్రసవ వేదనతో ఇంట్లోనే ప్రసవించింది. పుట్టిన వెంటనే పాప చనిపోయింది. చిన్నారిని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించి పోస్టుమార్టంకు తరలించారు.
చిన్నారి మృతదేహాన్ని ఇచ్చేందుకు మార్చురీ సిబ్బంది లంచం అడగడంతో మృతదేహాన్ని గుడ్డలో చుట్టకుండా అట్టపెట్టెలో పెట్టి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.