రాష్ట్రంలో వైసిపి అరాచకాలు ఎక్కువైపోతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీకి పతనం ఆరంభమైందని కళ్యాణదుర్గం టిడిపి ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. మంగళవారం బ్రహ్మసముద్రం మండలం వెస్ట్ కోడిపల్లి గ్రామంలో బాబు ష్యురిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు. ఆయన మాట్లాడుతూ నాలుగున్నర ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా శూన్యంగా మారిందన్నారు.