ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణ కాల్పుల విరమణకు, బేషరుతుగా బందీల విడుదలకు డిమాండ్ చేస్తూ ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటేసింది.
ఐరాస అత్యవసర ప్రత్యేక సమావేశంలో భాగంగా ఈజిప్టు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా. 193 సభ్యదేశాల్లో 153 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 23 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.