ఏపీలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మునిగిపోయే పడవని, అందుకే ఎమ్మెల్యేలు పక్కచూపు చూస్తున్నారన్నారు.
జనవరి నెలాఖరు నాటికి 35 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడే అవకాశాలున్నాయని అన్నారు. ఒక మాజీ మంత్రి కూడా పక్కచూపులు చూస్తున్నారని, వైసీపీ నుంచి పోటీకి ఎవరూ ఆసక్తిగా లేరని వ్యాఖ్యానించారు.