స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి దాఖలు చేసిన పిల్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను సీబీఐకి అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
నోటిసులు తీసుకొనేందుకు విముఖత చూపుతున్నారని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. తదుపరి విచారణలో పేపర్ పబ్లికేషన్ ద్వారా నోటీసులు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.