శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 28, జనవరి 4, 11, 18 తేదీల్లో 07113/07114 ప్రత్యేక రైలు కాకినాడ టౌన్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రైలు సాయంత్రం 5.40కి కాకినాడ టౌన్‌లో బయలుదేరి మర్నాటి రాత్రి 10 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో ఇదేరైలు ఈ నెల 30, జనవరి 6, 13, 20 తేదీల్లో అర్ధరాత్రి 12.30కి కొట్టాయంలో బయలుదేరి రెండోరోజు తెల్లవారుజామున 4 గంటలకు కాకినాడ చేరుతుంది. ఈ ప్రత్యేక రైలు సామర్లకోట, అనపర్తి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, కోయంబత్తూరు, ఎర్నాకుళం స్టేషన్లలో ఆగుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
జనవరి 6, 13 తేదీల్లో 07009/07010 ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.45కి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.05కి కొట్టాయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు జనవరి 8, 15 తేదీల్లో కొట్టాయంలో అర్ధరాత్రి 12.30కి బయలుదేరి రెండోరోజు ఉదయం 5గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రైలుకు ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, కోయంబత్తూరు, ఎర్నాకుళం స్టేషన్లలో ఆగుతుంది. అయ్యప్ప భక్తులు ఈ రైళ్ల సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్- జనవరి మాసాల్లో వివిధ తేదీల్లో మొత్తంగా 51 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. వివిధ తేదీల్లో రాకపోకలు కొనసాగించే ఆ రైళ్ల నెంబర్లు, తేదీలతో పాటు పలు వివరాలను ప్రకటనలో తెలియజేశారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సెకెండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ రైళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యేవాటితో పాటుగా పొరుగు రాష్ట్రాల నుంచి బయల్దేరి ఏపీ, తెలంగాణ మీదుగా నడిచేవి కూడా చాలా ఉన్నాయి. డిసెంబర్, జనవరి నెలల్లో శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.. అందుకే ఆ రద్దీని బట్టి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa