ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆందోళనకు సిద్ధమైన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద 36 గంటల ధర్నా, వంటావార్పు కార్యక్రమం చేపట్టింది. కనీస వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రభుత్వ సెలవులు, సంక్షేమ పథకాల అమలు, గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు నిరసనకు దిగారు. ఈ క్రమంలో అనంతపురం కలెక్టరేట్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు.