అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో ఆర్మీ స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం స్వల్పంగా పేలుడు సంభవించిందని రక్షణ శాఖ అధికారి తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లు నివేదికలు లేవు.ఘటనకు సంబంధించిన వివరాలు, పేలుడు స్వభావం తెలియాల్సి ఉందని అధికారి తెలిపారు.పట్టణంలోని లిచుబరి ప్రాంతంలోని ఆర్మీ స్టేషన్ గేటు దగ్గర రాత్రి 8 గంటల సమయంలో పేలుడు శబ్ధం వినిపించిందని పోలీసు అధికారి తెలిపారు.జిల్లా కమీషనర్ పుల్లక్ మహంత మరియు సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం శిబిరంలో ఉన్నారు.ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు పట్టణంలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు.