ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారత లక్ష్యంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించి.. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకూ పది రోజుల పాటు వైఎస్సార్ చేయూత సాయాన్ని అందించాలని నిర్ణయించింది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న అక్కచెల్లెమ్మల జీవనోపాధి కల్పనకు ఏటా రూ.18,750 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది.
ఏపీ సీఎం జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను 2024 ఎన్నికల్లోగా తేల్చేలా ఆదేశాలివ్వాలంటూ మాజీ ఎంపీ హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రతివాదులైన జగన్‌కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. గతంలో జారీచేసిన నోటీసులు అందకపోవడంతో ఈ చర్య తీసుకుంది.