తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో టీటీడీ ప్రతిరోజూ 100 ఆఫ్‌లైన్ శ్రీవాణి టిక్కెట్లను జారీ చేస్తోంది. అయితే శ్రీవాణి టిక్కెట్‌లను ఎయిర్‌పోర్టులో జారీ చేసేందుకు అనుమతి లేకపోవడంతో డిసెంబర్ 16వ తేదీ శనివారం నుంచి వాటిని విమానాశ్రయంలో కాకుండా తిరుమల గోకులం రెస్ట్‌హౌస్‌లో జారీ చేయనున్నారు. ప్రతిరోజూ 100 టిక్కెట్లు సమర్పించిన భక్తులకు శ్రీవాణి దర్శనం ఆఫ్‌లైన్ టిక్కెట్లను యథావిధిగా అందజేస్తామని టీటీడీ వెల్లడించింది. విమానాశ్రయంలో శ్రీవాణి దర్శనం టికెట్ కౌంటర్ మార్పును భక్తులు గమనించాలని టీటీడీ అధికారులు కోరారు.
తిరుప్పావైతో మేలుకొలుపు: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి 2024 జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 19వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 19న బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ.. ఈ కారణంగా డిసెంబర్ 18వ తేదీ సోమవారం సిఫారసు లేఖలను స్వీకరించబోమని టీటీడీ ప్రకటించింది. రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. దీంతో..రేపటి నుంచి జనవరి 14వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను రద్దు చేశారు. నెల రోజుల పాటు సుప్రభాతం కాకుండా తిరుప్పావైతో స్వామిని పూజిస్తారు. ఇక వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ఈ నెల 23 నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం జరగనుంది. 22న తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు ఆఫ్‌లైన్‌లో టోకెన్లు జారీ చేస్తారు. రోజుకు 42500...పది రోజులకు 4.25 లక్షల టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.