వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి గుర్తింపు తీసుకువస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించడంలో సీఎం జగన్ ముందు వరుసలో ఉంటారు అని వైసీపీ నాయకులు తెలిపారు. వారు మాట్లాడుతూ.... ఆర్చరీలో ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించిన విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతికి సురేఖకు డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ప్రభుత్వం. గత సర్కారు పాలనలో జ్యోతి సురేఖ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కలేదన్న విషయాన్ని గుర్తించి.. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చింది. అదే విధంగా రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సముచిత రీతిలో గౌరవించింది. అదే విధంగా.. వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని విధాలా అండగా ఉంటోంది అని అన్నారు.