ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 18, 2023, 09:47 AM

నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో సోమవారం(నేడు) విచారణ జరగనుంది. ఇసుక పాలసీలో అక్రమాలు, ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. ఈ కేసులపై మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది.
ఇసుక పాలసీలో చాలా అవకతవకలు జరిగాయని చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు పెట్టారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్‌ఆర్) కేసులో క్విడ్ ప్రోకో కింద టీడీపీ నేతపై సీబీఐ అధికారులు మరో కేసు నమోదు చేశారు. దీంతో ఈ రెండు కేసుల విచారణ నేడు ఏపీ హైకోర్టులో కొనసాగనుంది. ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇసుక పాలసీలో అక్రమాలు, ఐఆర్ ఆర్ కేసులో హైకోర్టు తీర్పు కొనసాగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com