ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు చేసింది. వ్యాధి వ్యాప్తి తీరును జాగ్రత్తగా పరిశీలించాలని, వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలపాలని కోరింది. డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక విభాగం చీఫ్ డా. మరియా వాన్ ఖర్కోవ్ వీడియో సందేశం ద్వారా పలు సూచనలు చేశారు. కొవిడ్ వైరస్‌తో పాటూ ఇన్ఫ్లుయెంజా, బ్యాక్టీరియా, ఇతర పలురకాల వైరస్లు వ్యాప్తిలో ఉన్నాయని వివరించారు.