భార్యపై కోపంతో బిడ్డను బలితీసుకున్నడు ఓ కసాయి తండ్రి. తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని టీపీకోటకు చెందిన దిలీప్(30) లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు.
తమిళనాడులో పరిచయమైన నందిని(25)ని ప్రేమించాడు. వీరికి దిలీప్ ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. భార్యపై అనుమానంతో గొడవలు జరిగేవి.
సోమవారం గొడవకు కొడుకే కారణమని తండ్రి చేతుల్లోకి తీసుకొని విసిరేశాడు. గాయపడిన కొడుకుని భార్య ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడు.