తాటిపర్తి సమీపంలో టిడిపి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేపట్టిన నిరసన శిబిరానికి వైసిపి నాయకులు హిజ్రాలను తీసుకురావడం చర్చనీయాంశ మైంది.
గడువు ముగిసినా ఓ క్వారీ నుంచి అక్రమ తవ్వకాలను అడ్డకునేందుకు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అయితే వైసిపి నాయకులు సోమవారం సాయంత్రం నెల్లూరు నుంచి రెండు బస్సుల్లో వంద మంది హిజ్రాలను శిబిరానికి తీసుకొచ్చారు. శిబిరంలో జనం ఉండటంతో వారు వెనుతిరిగారు.