రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్‌కు కాకుండా కనేకల్ పోలీస్ స్టేషన్‌కు పయ్యావులను పోలీసులు తరలిస్తున్నారు. పయ్యావుల కేశవ్ అరెస్టు సమయంలో రైతులు వర్సెస్ పోలీసుల మధ్య తీవ్రతోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. పయ్యావుల కేశవ్‌ను అరెస్టు చేసేందుకు రెండు గంటల పాటు పోలీసుల తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. పయ్యావుల కేశవ్‌తో పాటు ముఖ్య నాయకులను అరెస్టు చేసి రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలిస్తున్నారు.