ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో తమ న్యాయమైన 11 డిమాండ్లను పరిష్కరించాలని గత వారం రోజులుగా అంగనవాడి కార్యకర్తలు సమ్మె నిర్వహిస్తున్నారు. సమ్మెలో భాగంగా 8వ రోజు మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడి కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఐటీయూసీ, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.