వేముల మండలంలోని గొల్లలగూడూరు, పెర్నపాడు గ్రామాల్లో మండల టీడీపీ పరిశీలకుడు మారెడ్డి జోగిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి టీడీపీ మినీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. తల్లికి వందనం, దీపం, ఆడబిడ్డనిధి, ఉచిత బస్సు, యువ గళం, అన్నదాత పథకాల వల్లప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.