ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ ఇతర దేశాల్లోని భారత పౌరులు తప్పుడు పనులు చేసినట్లు తమకు దృష్టికి తెస్తే వాటిని తాము పరిశీలిస్తామన్నారు.
తగిన ఆధారాలు ఉంటే విచారణకు సహకరిస్తామని తెలిపారు. భారత్- అమెరికా మధ్య భద్రత, ఉగ్రవాద వ్యతిరేక సహకారం కీలకమైన అంశమని మోదీ తెలిపారు.