వాల్తేర్ డివిజన్ పరిధిలో తిలారు-ఉర్లాం సెక్షన్లో జరుగుతున్న ఆధునికరణ పనుల కారణంగా విశాఖ-పలాసా-విశాఖ పాసింజర్ స్పెషల్ రైలును రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డిసిఎం త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 21 గురువారం నుంచి 23వ తేదీ శనివారం వరకు పాసింజర్ స్పెషల్ ట్రైన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa